వాతావరణ మార్పులు మొకలకు సవాల్‌గా మారుతాయి. చలికాలంలోనైతే తగినంత సూర్యరశ్మి అందకపోవడంతో మొకలు త్వరగా వాడిపోతాయి. ఇలా వాడిపోయే మొక్కల్లో కరివేపాకు ఒకటి. ఇది చలికాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రతి ఇంట్లో ఉండే కరివేపాకు మొకను ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..
సూర్యరశ్మి లేకపోవడం వల్ల కరివేపాకు మొకలో ఎదుగుదల లోపిస్తుంది. నిరంతరం నీడలో ఉండటం మూలంగా దాని ఆకులు బలహీనంగా, పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. మొక్కలపై తక్కువ సూర్యరశ్మి వస్తున్నట్లయితే వెంటనే అలర్ట్ అవ్వండి. రోజులో కనీసం 5-6 గంటలు.. వాటికి సూర్యరశ్మి లభించేలా చూడండి. అప్పుడే మొక్కలో కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది. ఇక నీరు పెట్టే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీరు పెట్టేముందు మట్టిని తనిఖీ చేసి.. నేల పొడిగా ఉన్నప్పుడే నీళ్లు పెట్టండి. నీరు ఎక్కువగా పెడితే.. మొక బలహీనపడి కుంగిపోతుంది. పోషకాలు ఎకువగా ఉంటే.. కరివేపాకు మొక్కలు బాగా పెరుగుతాయి. ఆవు పేడ (ఎండినది) లేదా వర్మీ కంపోస్ట్‌ను కలిపిన మట్టిని వాడటం వల్ల.. మొక్కలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇక రసాయన మందులకు దూరంగా ఉండేలా.. ఇంట్లోనే సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం.. బియ్యాన్ని తేలికగా రుబ్బి నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి బియ్యాన్ని ఒక కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని కరివేపాకు మొకలకు ఎరువుగా వాడొచ్చు. పులియబెట్టిన మజ్జిగ, ఎండబెట్టిన వేపాకు కూడా కరివేపాకు మొక్క ఎదుగుదలలో ఉపకరిస్తాయి.