అద్దం పగిలితే అతికించొచ్చు. కానీ అతికించిన అద్దం మునుపటిలా ఉండదు. దాని సహజత్వాన్ని కోల్పోతుంది. నిజాయితీ కూడా అద్దం లాంటిదే. ఒక్కసారి దాన్ని కోల్పోతే, ఎప్పటికీ మునుపంత స్వచ్ఛంగా ఉండలేం.’ అన్నారు నటి తమన్నా భాటియా. ఇటీవల ఓ చాటింగ్ సేషన్లో పలు విషయాలను నర్మగర్భంగా వెల్లడించారు తమన్నా. ‘హత్య చేసినా క్షమిస్తాను కానీ.. అబద్ధం అడితే క్షమించలేను. నిజాయితీ కోల్పోవడం నా దృష్టిలో ఆత్మహత్యతో సమానం.’ అని ఘాటు స్పందించారు తమన్నా.
ఈ వ్యాఖ్యానం విన్నవాళ్లంతా.. ఇదంతా తన మాజీ ప్రియుడు విజయ్వర్మను ఉద్దేశించేనంటూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడా విజయ్‌వర్మ పేరును ప్రస్తావించకపోయినా.. ఆ టైమింగ్, రైమింగ్‌ను బట్టి, ఇది కచ్చితంగా అతని గురించేనని అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.