Travis Head : స్వదేశంలో భారత జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ముందంజ వేయాలనుకుంటున్న ఆస్ట్రేలియాకు షాక్. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) చివరి రెండు టీ20లకు దూరం కానున్నాడు. డేంజరస్ బ్యాటర్ అయిన హెడ్ సిరీస్ నుంచి వైదొలగడానికి కారణం ఉంది. త్వరలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఉన్నందున హెడ్‌ను రిలీవ్ చేశారు సెలెక్టర్లు. అతడి స్థానంలో గాయం నుంచి కోలుకున్న బెన్ ద్వారుషిని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. భారత్, ఆసీస్‌ల మధ్య నవంబర్ 6న నాలుగో టీ20 జరుగనుంది. మూడో మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్ సమం చేసిన టీమిండియా మరో విజయంతో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టులో ప్రధాన బ్యాటర్ అయిన ట్రావిస్ హెడ్ యాషెస్ సిరీస్‌లో కీలకం కానున్నాడు. అందుకే.. అతడు టెస్టు క్రికెట్‌కు సన్నద్ధం కావడానికి షీఫెల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఆడనున్నాడు. వచ్చేవారం టస్మేనియా జట్టుతో హెడ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కానున్నాడు.
Travis Head will miss the final two T20Is against India, set to play for South Australia in the Sheffield Shield next week
Read more: https://t.co/lrwWWUAsmR pic.twitter.com/7YCYSiWttV
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2025
నవంబర్ 21న తొలి టెస్టుతో యాషెస్ పోరు ప్రారంభం కానుంది. అయితే.. తొలి టెస్టుకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కానున్నందున స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరించనున్నాడు. కానీ, ఓపెనర్ల కాంబినేషన్ ఇంకా కుదరలేదు. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ఎవరిని పంపాలి? అనే విషయంపై కోచ్ మెక్‌డొనాల్డ్, టీమ్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది.