Afghanistan | తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. ప్రధానిగా మొహమ్మద్ హసన్
Afghanistan | తాతాల్కిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. ప్రధానిగా మొహమ్మద్ హసన్ | ఆఫ్ఘన్‌ను ఆక్రమించిన తాలిబన్లు మంగళవారం తాతాల్కిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. తాలిబన్ల శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే సంస్థ ‘రెహ్బరీ షురా’ సంస్థ కొత్త ప్రభుత్వానికి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ నేతృత్వం వహిస్తారని తాలిబన్లు పేర్కొన్నారు. తాలిబన్ సహ వ్యవహస్థాపకుడు

కాబూల్ : ఆఫ్ఘన్‌ను ఆక్రమించిన తాలిబన్లు మంగళవారం తాతాల్కిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. తాలిబన్ల శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే సంస్థ ‘రెహ్బరీ షురా’ సంస్థ కొత్త ప్రభుత్వానికి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ తాతాల్కిక ప్రధానిగా నియమించింది. తాలిబన్ సహ వ్యవహస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరదార్, మౌలావి హనాఫీ డెప్యూటీ నేతలుగా ఉంటారని.. తాలిబన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. కొత్త ప్రభుత్వం రెహ్బరీ షురా సంస్థ అధిపతి ఆధ్వర్యంలో వ్యవహారాలన్నింటిని ప్రభుత్వం నడిపించనుంది.
అలాగే, సారాజుద్దీన్ హక్కానీని తాత్కాలిక ఇంటీరియర్ మంత్రిగా, తాలిబాన్ అధికార ప్రతినిధి అబాస్ స్టానిక్జాయ్ కొత్త ఆఫ్ఘన్ ప్రభుత్వంలో ఉప విదేశాంగ మంత్రిగా వ్యవహరించనున్నట్లు ముజాహిద్ తెలిపారు. ముల్లా యాకూబ్ కొత్త ఆఫ్ఘన్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా నియామకమవగా.. అమీర్ ఖాన్ ముత్తాకీని విదేశాంగ మంత్రిగా నియమించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. అమెరికా దళాలు ఆఫ్ఘాన్‌ను వీడుతున్న క్రమంలో ఆగస్ట్ 15న కాబుల్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 20 రోజుల తర్వాత ప్రభుత్వ ఎట్టకేలకు తాలిబన్లు ప్రకటన విడుదల చేశారు.
గతవారమే ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు ప్రకటన చేయాల్సి ఉంది. పలు కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాత్కాలిక ప్రభుత్వంలో 20 సంవత్సరాలు పాటు, అమెరికా, దాని మిత్రదేశాలపై నిర్విరామంగా పోరాటం చేసిన వారికి తాలిబన్లు ప్రభుత్వంలో పెద్దపీట వేశారు. అపద్ధర్మ ప్రధాని ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలో పాలన సాగనుండగా.. 2001లో తాలిబన్ల ప్రభుత్వం కుప్పకూలిన సమయంలోనూ ఈయనే ప్రధానిగా ఉండడం గమనార్హం. మరోవైపు అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు సాగించిన, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కేబినెట్లో ఉప ప్రధాని బాధ్యతలను అప్పగించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

