చలికాలంలో వేడినీటితో స్నానం చేయడం సహజం! అయితే.. వేడి ఎక్కువైతే మాత్రం చాలా ప్రమాదం! చలినుంచి ఉపశమనం ఏమోగానీ.. చర్మానికి ఎంతో హానికరం! వేడినీటి స్నానానికి ఉపయోగించే నీళ్ల ఉష్ణోగ్రత.. 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుమించితే.. చర్మానికి హానికరమని హెచ్చరిస్తున్నారు.