Tadoba Andhari Tiger Reserve | మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అంధారి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో అందమైన, ఆకర్షించే చారల పులులను చూడటానికి ఇది సరైన ప్రదేశం. ఇక్కడ తిరిగే పులులను చూడడానికి జనాలు క్యూ కడుతారు. రీసెంట్గా ఈ అంధారి టైగర్ రిజర్వ్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సందర్శించారు. అయితే తాజాగా ఈ రిజర్వ్ అటవీ ప్రాంతంను సందర్శించిన తెలుగు ఫ్యామిలీ అక్కడి చిత్రాలను నమస్తే తెలంగాణతో పంచుకుంది. దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. మనుషులతోపాటూ.. జంతువులూ కూడా చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్నాయి. అయితే పగటి వేళలో బయటకు వచ్చిన పులులను తన కెమెరాతో బంధించాడు వ్యాసకర్త.
1. చంద్రాపూర్‌లోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో పులి ఒంటరిగా నిద్రపోతుండగా.. ఈ అరుదైన ఘటనను టూరిస్ట్ తన కెమెరాలో బంధించారు.
2. 3 పులి పిల్లలు తన తల్లి దగ్గరకు రాగా.. తల్లి పులి వాటితో కలిసి ముందుకు సాగింది.
3. తల్లి పులి ఆహారం కోసం వెతుకుతుంది.
4. తల్లి పులి ఆహారం కోసం వెతుకుతూ.. తన పిల్లలతో ముందుకు సాగింది.
5. పులి ఆహారం కోసం జింకను చూసింది. నెమ్మదిగా జింకపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక మొత్తం పులులు ఒకే చోట ఉండగా.. వాటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉండగా.. హైదరాబాద్ నుంచి 406 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సుతో పాటు రైలు ప్రయాణంలో ఈ టైగర్ రిజర్వ్‌ను సందర్శించవచ్చు.