అగ్ర కథానాయిక తాప్సీ గత మూడేళ్లుగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నది. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. మహిళా ప్రధాన కథలతో హిందీ చిత్రసీమలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నది. తాజాగా ఈ భామ ‘అస్సి’ పేరుతో రూపొందుతున్న కోర్ట్ రూమ్ డ్రామాలో నటిస్తున్నది. శుక్రవారం విడుదలైన ‘బోర్డర్-2’ థియేటర్లలో ‘అస్సి’ ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నారు.
ఈ సినిమాలో తాప్సీ లాయర్ పాత్రను పోషిస్తున్నది. గ్యాంగ్‌రేప్‌కు గురైన ఓ మహిళ పక్షాన పోరాటం చేసే న్యాయవాదిగా ఆమె పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్దారు. ముల్క్, తప్పడ్ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు అనుభవ్ సిన్హాతో కలిసి తాప్సీ పనిచేసిన చిత్రమిది కావడం విశేషం.
‘పింక్’ సినిమా తర్వాత తాప్సీ మరో కోర్ట్‌రూమ్ డ్రామాలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఖని కుస్రుతి, మహ్మద్ జీషాన్ అయూబ్, రేవతి, కుముద్ మిశ్రా తదితరులు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకురానుంది.