గోపీచంద్ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ హిస్టారికల్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘గోపీచంద్ 33’ వర్కింట్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీగా ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో ైక్లెమాక్స్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తున్నారు. 25రోజులు సాగే ఈ భారీ షెడ్యూల్ కోసం ఓ పెద్ద సెట్‌ని కూడా నిర్మించారు. కేవలం రాత్రుళ్లు మాత్రమే చిత్రీకరణ జరుపుకునే ఈ ఎపిసోడ్ ఉద్వేగభరితంగా ఉంటుందని, ఆడియన్స్‌కి గూజ్బంప్స్ తెప్పిస్తుందని, ఇప్పటివరకూ చూడని విధంగా, మరిచిపోలేని అనుభూతిని కలిగించేలా దర్శకుడు సంకల్పరెడ్డి ఈ ఎపిసోడ్‌ని డిజైన్ చేశారని మేకర్స్ చెబుతున్నారు.
దేశ చరిత్రలో వెలుగు చూడని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని చూపించే ఈ కథలో గోపీచంద్ మహాయోధునిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సమర్పణ: పవన్‌కుమార్, నిర్మాణం: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్.