ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నిలకడగా కొనసాగుతుంది. నాలుగు రోజులు గా లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం సాయంత్రానికి 93,732 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండ గా 16 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 64,720 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు.
ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 730, సమాంతర కాలువకు 150, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కు ల నీటిని ఆయకట్టు, త్రాగునీటి పథకాల నిర్వహణకు విడుదల చేస్తున్నారు. విద్యుతుత్పత్తికి 38,529 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఉమ్మడి విద్యుత్కేంద్రాలలో 12 యూనిట్లలో విద్యుతుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతుంది.
ఎగువ జూరాలలో 6 యూనిట్ల ద్వారా 4.298 మి.యూ ఉత్పత్తి జరుగగా, ఇప్పటి వరకు మొత్తంగా 284.382 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాలలో 6 యూనిట్ల ద్వారా 4.380 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 308.383 మి.యూ ఉత్పత్తి జరిగింది. ప్రాజక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా సాయం త్రానికి 8.434 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజక్టు నుంచి 1,05,790 క్యూసక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది.