40 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం
నేరేడుచర్ల, అక్టోబర్ 27 : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో బుధవారం తెల్లవారుజామున హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కార్డ్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 40 బైక్‌లు, మూడు ఆటోలు, ఒక డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో కోదాడ, మునగాల సీఐలు నరసింహ, ఆంజనేయులు, నేరేడుచర్ల ఎస్ఐతో విజయ్ ప్రకాశ్‌తో పాటు మరో 23 మంది ఎస్ఐలు, 125 మంది సిబ్బంది పాల్గొన్నారు.