న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండాలని వేసిన ఓ పిల్‌ను ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యార్థులు, టీచర్లు ఒకే విధమైన డ్రెస్ కోడ్‌లో ఉండాలని ఆ పిటిషన్లో కోరారు. ఇటీవల డ్రెస్ కోడ్ అంశంలో కర్నాటకలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ముస్లిం మహిళలు బుర్ఖా ధరించి క్లాస్‌రూమ్‌లకు రావొద్దు అని ఓ కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది.