న్యూఢిల్లీ: తమిళనాడులోని లిక్కర్ లైసెన్సింగ్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయడం రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవడం కాదా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మీరు రాష్ట్ర పోలీసుల అధికారాల్లో జోక్యం చేసుకోవడం లేదా? అని నిలదీసింది. ఒక వేళ రాష్ట్ర పోలీసులు తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) లిక్కర్ స్కామ్ కనుక దర్యాప్తు చేయకపోతే ఈడీ జోక్యం తప్పనిసరా? ఇది సమాఖ్య నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈడీ దాడులు అక్రమమని, వాస్తవానికి దాడులు చేసే అధికారం ఈడీకి లేదని తమిళనాడు సర్కారు కోర్టును ఆశ్రయించింది.