సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ లైవ్ ప్రసారాలు ప్రారంభం
Supreme Court live-streaming:సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణను తొలిసారి లైవ్‌లో ప్రసారం చేశారు. శివసేనకు సంబంధించిన కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన కేసు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణను తొలిసారి లైవ్‌లో ప్రసారం చేశారు. శివసేనకు సంబంధించిన కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన కేసును ధర్మాసనం విచారించింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న కేసుల్ని లైవ్‌లో ప్రసారం చేయాలని గతవారం సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే.
సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలో గతవారం ఏకగ్రీవం నిర్ణయం తీసుకున్నారు.రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న కేసుల్ని లైవ్ చేయాలని 2018, సెప్టెంబర్ 27వ తేదీన ఆ నాటి సీజేఐ దీపక్ మిశ్రా తెలిపారు. దాని ప్రకారమే యూట్యూబ్‌లో సుప్రీం విచారణను ప్రసారం చేస్తున్నారు. అయితే యూట్యూబ్‌కు బదులుగా త్వరలోనే స్వంత ఫ్లాట్‌ఫామ్‌పై సుప్రీం విచారణలను లైవ్ చేయనున్నట్లు సీజే లలిత్ పేర్కొన్నారు. ఈ లైవ్ ప్రసారాలను ప్రజలు తమ సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో వీక్షించవచ్చు. అయితే ఆగస్టు 26వ తేదీన మాజీ సీజేఐ ఎన్వీ రమణ వెబ్ పోర్టల్ ద్వారా లైవ్ ప్రసారాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

