హైదరాబాద్: ధాన్యం సేకరణ సమస్యలపై ఢిల్లీలో ఎఫ్‌సీఐ సీఎండీ అతీశ్ చంద్రతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం భేటీ అయ్యారు. ఖర్చుకు వెనకాడకుండా సీఎం కేసీఆర్ రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరంతో రైతులు ప్రతిఫలాలు పొందుతున్నారని అన్నారు. ఈ సమయంలో ధాన్యం సేకరణలో రైతులకు కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఉందిని పేర్కొన్నారు.
వారి ఆదాయం రెట్టింపునకు మానవీయం కోణంలో స్పందించాలని మంత్రి కోరారు. రైతు ఉత్పత్తుల సేకరణలో మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా అందించేందుకు సహకరించాలని కోరారు. 80 లక్షల క్వింటాళ్ల మేర సేకరణకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతివ్వాలని అన్నారు.