తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలను ఆదుకోవాలి: ఏపీ సీఎం జగన్

తిరుపతి : తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు కేంద్రం ఆదుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆదివారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రారంభోపాన్యాసం చేసిన జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిరెండుగా విభజించడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా విభజన హామీలు అమలు కావడంలేదని, సమస్యలన్నీ పెండింగ్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
రీసోర్స్ గ్యాప్నూ భర్తీచేయలేదని, ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని జగన్ కోరారు.రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదని, వెంటనే సవరణలుచేయాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

