న్యూఢిల్లీ: చిన్న బాలుడు ఉన్నట్టుండి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాడు. అయితే రెప్పపాటు కాలంలో స్పందించిన తల్లి కుమారుడ్ని కాపాడింది. అతడు నీటిలో పడకుండా గాల్లోనే చొక్కా పట్టుకుని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసింది. ‘ది ఫిగెన్’ అన్న ట్విట్టర్ ఖాతా యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో ఒక బాలుడు ఈత కొలను అంచన నుల్చొని ఉంటాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్‌లోకి జంప్ చేస్తాడు. అయితే తన కుమారుడ్ని గమనిస్తున్న అతడి తల్లి వెంటనే స్పందించింది. పరుగున అక్కడకు వచ్చి ఒక్క చేతితో అతడి షర్ట్ పట్టుకుంటుంది. ఈత కొలనులో పడి మునగక ముందే అల్లరి బుడతడ్ని ఆమె కాపాడింది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్ప్లిట్ సెకండ్లో కుమారుడ్ని కాపాడిన ఆ తల్లిని సూపర్ మామ్‌గా నెటిజన్లు అభివర్ణించారు. రియల్ స్పైడర్ లేదా సూపర్ మ్యాన్ కూడా ఇంత తొందరగా స్పందించి ఉండరేమోనని వ్యాఖ్యానించారు. పిల్లల రక్షణకు సంబంధించి తల్లులకు సూపర్ పవర్, సూపర్ హ్యూమన్ శక్తులుంటాయని కొందరు పేర్కొన్నారు.
Mother of the year!👏 pic.twitter.com/TIXn8P85gx
— Figen (@TheFigen) April 30, 2022