లండన్ : ఇంగ్లండ్ టీ20 లీగ్ హండ్రెడ్ టోర్నీలో భారత ప్రముఖ కంపెనీల ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే లక్నో(మాంచెస్టర్ ఆర్జినల్స్, ముంబై(ఒవల్ ఇన్విన్సిబుల్) ఫ్రాంచైజీలు హండ్రెడ్‌లో పెట్టుబడులు పెట్టగా తాజాగా సన్‌గ్రూప్..హండ్రెడ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టును కొనుగోలు చేసింది. యార్క్‌షైర్ సీసీసీకి చెందిన నార్తర్న్ సూపర్చార్జర్స్లో పూర్తి వాటాను 1,092 కోట్లకు సన్గ్రూపు దక్కించుకుంది.
ఇద్దరి మధ్య ఒప్పందాన్ని ఎనిమిది వారాల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని లీగ్ ప్రతినిధులు పేర్కొన్నారు. పురుషుల, మహిళల జట్లను కల్గి ఉన్న నార్తర్న్ చార్జర్స్ ఇప్పటి వరకు టైటిల్ గెలువలేకపోయింది. ఇప్పటికే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఎస్ఏ టీ20లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కల్గిన ఉన్న సన్గ్రూపునకు ఇది మూడో జట్టు కావడం విశేషం.