‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు సుజిత్ తన తర్వాత సినిమా విషయంలోనూ భారీగానే ముందుకెళ్తున్నారు. నెక్ట్స్ ఆయన నానీతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించనున్నారు సుజిత్. అందులో భాగంగా మలయాళ అగ్ర హీరో పృధ్వీరాజ్ సుకుమారన్‌ని ఇందులో విలన్‌గా తీసుకున్నారని వినికిడి.
ఇప్పటికే పృథ్వీరాజ్‌కు కథ కూడా వినిపించారట. ప్రస్తుతం మహశ్, రాజమౌళిల ‘SSMB 29’లో విలన్‌గా నటిస్తున్నారు పృథ్వీరాజ్. ఇప్పుడు క్యారెక్టర్ నచ్చడంతో నానీ సినిమాలోనూ విలన్‌గా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.