పాడిల్ బాల్ గేమ్ అంటే అలియాభట్‌కు చాలా ఇష్టం. ఆమె క్రమం తప్పకుండా రోజూ ఈ గేమ్ ఆడతారు. ఇటీవల ఆ గేమ్ ఆడి ఇంటికి వస్తున్న సమయంలో కొందరు ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫొటోలు తీయబోగా అలియా అసహనానికి లోనైన విషయం తెలిసిందే. అయితే.. రీసెంట్గా తాను పాడిల్ బాల్ గేమ్ ఆడుతూ ఉన్న వీడియోను అలియా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్రీడాకారిణిగా కూడా సూపర్ అనిపించేలా అలియా ఈ గేమ్ ఆడటం ఈ వీడియోలో చూ డొచ్చు.
‘జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలంటే కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యానికి కావాల్సింది వ్యాయామం. ఆ వ్యాయామంలోనే వినోదాన్ని వెతుక్కుంటాన్నేను. అదే పాడిల్ బాల్ గేమ్. ఈ ఆట నాకెంతో ఇష్టం. ఒక తల్లిగా, ఒక నటిగా, ఒక వ్యాపారవేత్తగా విజయవంతంగా ముందుకెళ్తున్నానంటే కారణం ఈ గేమ్..’ అంటూ ఈ వీడియోతోపాటు పేర్కొన్నారు అలియా. ఈ వీడియో చూసిన వారంతా అలియాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.