అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లా అరకు మండలం కొత్తబల్లుగూడలో విషాదం నెలకొంది. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుజ్జలి రాధ(32), నన్ని సుమన్(34) అనే ఇద్దరు ఉపాధ్యాయులు రాత్రి ఆహారంలో విషం కలుపుకుని తిని ఆత్మహత్య చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కుటంబకలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.