
జ్యోతినగర్(రామగుండం), నవంబర్ 21: వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం కలకలంరేపిం ది. ఒడిశాలోని కైరీ గ్రామానికి చెందిన సంజయ్‌కుమార్ బెహ్ర(27) హైదరాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఒడిశాకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమం లో ఆదివారం రైలులో ఒడిశా నుంచి రామగుండానికి వచ్చాడు. ఇక్కడి రైల్వేస్టేషన్లో అందరూ చూస్తుండగానే వేగంగా వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెళ్లి మృతిచెందాడు. మరో ఘటనలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన కనకం మహేశ్ అలియాస్ వంశీ (23) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన వంశీ.. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. కరీంనగర్ శివారులోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలో గూడ్స్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు.