Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకుండా మూడేళ్లపాటు కాలయాపన చేసిందని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు.
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకుండా మూడేళ్లపాటు కాలయాపన చేసిందని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతోనే ఇప్పుడు ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొచ్చిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు మూడు నెలల సమయం కూడా పట్టదని, అలాంటిది మూడేళ్లపాటు జాప్యం చేసి ఇప్పుడు రిపేర్లు చేపడతామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కాలం గడిపిందని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగానే ఉన్నాయని సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ సంస్థ చెప్పిందని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టారని ఆరోపించారు.
కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో 750 టీఎంసీల నీటిని సముద్రం పాలయ్యేలా చేశారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలోనూ తాగునీటి కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇప్పటికే నగరంలో 2 లక్షల 30 వేల ట్యాంకర్ల నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి చివరకు బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు.
రెండో పంట వేయవద్దని చెప్పిన రేవంత్ రెడ్డికి రైతులు రెండోసారి ఓటు వేయవద్దని వ్యాఖ్యానించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్‌కు ఇప్పటివరకు మరమ్మతులు చేయించలేదని, ఎస్ఎల్బీసీ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యక్తికి విశాల దృక్పథం ఉండాలని హితవు పలికారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా కేసీఆర్ కొనసాగించారని సుధీర్ రెడ్డి గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్‌పై నిరంతరం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లను చెరపడం రేవంత్ రెడ్డి వల్ల సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సభలో తమకు మైక్ కట్ చేయకుండా మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏదో ఒక కారణంతో బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఎన్ని టార్గెట్లు పెట్టుకున్నా ఆయన ప్రయోగించిన బుల్లెట్లు లక్ష్యాన్ని చేరడం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వెళ్లలేదని సీఎం అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీలో సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

