Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
Rakul Preet Singh | నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘రామాయణ’ నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది.
Rakul Preet Singh | నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘రామాయణ’ నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సినిమాలో శూర్పణఖ కీలక పాత్రలో నటించిన ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ తాజాగా తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
భారతీయుల సంస్కృతికి ప్రతీక అయిన రామాయణ గాథను ఇంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో వెండితెరపై ఆవిష్కరించడం తన జీవితంలో మరువలేని అద్భుతమైన అనుభూతినిచ్చిందని రకుల్ పేర్కొన్నారు. ఈ గొప్ప ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు కృషి చేసిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుంచి ప్రపంచ స్థాయికి ఓ అద్భుతమైన సినిమాను అందించాలనే వారి తపన తనకెంతో స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు.
ఈ చిత్రంలో తనతో పాటు నటించిన రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, రవిదూబే, కాజల్ అగర్వాల్‌లతో పాటు సినిమా నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాత్ర కోసం రోజూ నాలుగు గంటల పాటు ఎంతో శ్రమించి తనను శూర్పణఖ రూపంలోకి తీసుకువచ్చిన కాస్ట్యూమ్ మరియు మేకప్ బృందాల కృషిని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది కేవలం తాను నటించిన మరో సినిమా మాత్రమే కాదని, భారతీయురాలిగా తాను ఎప్పటికీ గర్వపడే అరుదైన క్షణమని రకుల్ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

