భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం (చిలకపల్లి) గ్రామానికి చెందిన అజ్మీరా చందు నాయక్ (39) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం (చిలకపల్లి) గ్రామానికి చెందిన అజ్మీరా చందు నాయక్ (39) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు మృతుడి భార్య పావని, ఆమె ప్రియుడు ధరావత్ సంతోష్ కారణమని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన పావనికి ధరావత్ సంతోష్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భర్త చందు నాయక్ తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన పావని.. ప్రియుడు సంతోష్‌తో కలిసి అతడిని హతమార్చాలని పథకం వేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై మూడు రోజుల క్రితం గ్రామంలో పంచాయితీ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం స్థానిక సర్పంచ్‌ను చందు నాయక్ ఆశ్రయించగా.. శుక్రవారం పంచాయతీకి సమయం ఇచ్చింది. అయితే పంచాయితీలో తమ వివాహేతర సంబంధం విషయం బయటపడుతుందనే భయంతో పావని, సంతోష్ ముందుగానే చందు నాయక్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న చందు నాయక్‌పై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిలో తీసుకెళ్లి చిలకపల్లి గ్రామ శివారులో పడేశారు.
గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, భూపాలపల్లి, గణపురం సీఐలు శ్రీనివాస్, కరుణాకర్ రావు, ఎస్సై పవన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలు, నేరంలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

