Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Sreeja Reddy | ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి అదృశ్యమైంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ శ్రీజా రెడ్డి (23) అమెరికాలోని బోస్టన్‌లో కనిపించకుండా పోయింది.
Sreeja Reddy | ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి అదృశ్యమైంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ శ్రీజా రెడ్డి (23) అమెరికాలోని బోస్టన్‌లో కనిపించకుండా పోయింది. నవంబర్ 2న రాత్రి వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతులకు శ్రీజ ఒక్కగానొక్క కుమార్తె. ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో ఏడాది క్రితం ఆమె అమెరికా వెళ్లింది. బోస్టన్లోని ఓ కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. చదువుతోపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది. మరో ఆరు నెలల్లో కోర్సు పూర్తికావాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్లకుండా..
శ్రీజ బోస్టన్లోని డోర్చెస్టర్ ప్రాంతంలో మరో ఎనిమిది మంది యువతులతో కలిసి నివాసం ఉంటోంది. నవంబర్ 2న కాలేజీకి వెళ్లి, పార్ట్‌టైమ్ ఉద్యోగం ముగించుకున్న అనంతరం తన గదికి చేరుకుంది. అదే రోజు రూమ్మేట్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు స్నేహితులు ఏర్పాట్లు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు వస్తానని చెప్పిన శ్రీజ.. కాసేపు వాకింగ్ చేసి వస్తానంటూ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళన చెందారు. నవంబర్ 2న రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో ఎడిసన్ గ్రీన్ సమీపంలో శ్రీజ చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆమె బయటకు వెళ్లిన తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ సుమారు అర కిలోమీటరు పరిధి వరకు మాత్రమే అందుబాటులో ఉందని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని తండ్రి యాదగిరిరెడ్డి తెలిపారు. శ్రీజ ఎంతకీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 3న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు.
శ్రీజ చివరిసారిగా కనిపించిన ప్రాంతం, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తీర ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతోనూ గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదు.
మరోవైపు తమ కుమార్తె అదృశ్యమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం నల్గొండ పర్యటనకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి తమ కుమార్తె ఆచూకీ కనుగొనేలా సహాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ప్రార్థిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

