సాగర్ హైవేపై సడెన్ బ్రేక్
- ధ్వంసమైన నాలుగు కార్లు, రెండు బస్సులు
- ఓ కండక్టర్, పలువురు ప్రయాణికులకు గాయాలు

వనస్థలిపురం, జనవరి 23 : సాగర్ రహదారి బీఎన్‌రెడ్డినగర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టించాయి. శ్రీపురంకాలనీ సమీపంలో ఇటీవల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అది గమనించని ఓ కారు డ్రైవర్ వేగంగా వెళ్లాడు. సడెన్‌గా సిగ్నల్ కనిపించడంతో హఠాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న మిథాని డిపోకు చెందిన బస్సు డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేశాడు. ఆ బస్సు వెనకాల ఉన్న ఇబ్రహీంపట్నంకు చెందిన బస్సు వేగం అదుపు తప్పి ముందు ఉన్న బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక ఉన్న మరో కారు బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో జరిగిపోయిన ఈ ప్రమాదంలో 4కార్లు, రెండు బస్సులు దెబ్బతిన్నాయి. రెండు బస్సుల్లో మొత్తం 62మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో ఓ కండక్టర్, నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయాలైన వారిని దవాఖానకు తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

