Diego Maradona : ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఫుట్‌బాలర్ డిగో మారడోనా సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఈ లెజెండరీ ఫుట్‌బాలర్ చనిపోయి ఈ రోజుతోరెండేళ్లు. దాంతో, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మారడోనాకు నివాళులు అర్పిస్తున్నారు. మనదేశానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో ఇసుకతో అర్జెంటీనా జెర్సీలో ఉన్న మారడోనా బొమ్మ వేశాడు. ఆ పక్కనే ఫుట్‌బాల్ మీద ట్రిబ్యూట్ టు మారడోనా అని రాశాడు. ఈ ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన మారడోనా అభిమానులు అతడి ఆటను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు.
డిగో మారడోనా ఫుట్‌బాల్ చరిత్రలో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 1986లో అర్జెంటీనా జట్టు కెప్టెన్ అయ్యాడు. ఆ ఏడాది వరల్డ్‌కప్ ఫైనల్లో జట్టుని విజేతగా నిలిపాడు. ఉండడమే కాకుండా 20వ శతాబ్దపు ఫిఫా ఆటగాడిగా గౌరవం పొందాడు. నాలుగు ఫిఫా వరల్డ్ కప్‌లలో ఆడిన ఇతను 2020 నవంబర్ 25వ తేదీన గుండెపోటుతో చనిపోయాడు. ఈమధ్యే సుదర్శన్ పట్నాయక్, ఫిఫా వలర్డ్ కప్ ట్రోఫీని సైకత శిల్పంగా వేశాడు.