బాలాసోర్, అక్టోబర్ 29: విమానాల్లో నుంచి నేలపై లక్ష్యాలను ఛేదించేందుకు తయారు చేసిన లాంగ్ రేంజ్ బాంబును డీఆర్డీవో, భారత వైమానిక దళం శుక్రవారం విజయవంతంగా పరీక్షించాయి. హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో సహకారంతో దీన్ని తయారు చేసింది. శుక్రవారం పరీక్షలో భాగంగా బాంబును ఐఏఎఫ్ యుద్ధ విమానం నుంచి జారవిడిచారు. ఒడిశాలోని చండీపూర్‌లో ఈ ప్రయోగం నిర్వహించారు. ఇది నిర్దేశించిన పరిమితుల్లో లక్ష్యాన్ని ఛేదించిందని అధికారులు తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోకు అభినందనలు తెలిపారు.