బొడ్రాయిబజార్, డిసెంబర్ 9 : సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా జిల్లా కేంద్రంలో గురువారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో సుప్రసిద్ధమైన స్థానిక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. షణ్ముఖ పీఠం సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.వి.డి.ప్రసాదరావు గురుస్వామి, రామలింగేశ్వర త్రిశక్తి సహిత అయ్యప్ప ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీశ్శర్మ ఆధ్వర్యంలో శ్రీవల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. సాయంత్రం స్వామికి పట్టాభిషేకం నిర్వహించి నగర సంకీర్తన చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గుడిపాటి కిరణ్, ఆమంచి రాజేంద్రప్రసాద్ వసుందర, ఎంవీవీ సత్యనారాయణ శారద, ఏడుకొండలు జయశ్రీ దంపతులు, కౌన్సిలర్ సుమీల గన్నారెడ్డి, రంగు ముత్యంరాజు, తూడి శ్రీనివాస్, సూర్యకుమారి, దంతాల కిరణ్, రామలింగేశ్వరాలయంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతుల సూర్యనారాయణ, తోట శ్యాం, అనంతుల దుర్గాప్రసాద్, మీలా వంశీ, బొమ్మిడి మహేశ్ పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన..
కోదాడ రూరల్ : తమ్మరలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం చేసింది. అనంతరం పాత ఆలయ స్థానంలో కొత్త ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బొల్లు చైతన్య, సాయి, ధనాల వెంగయ్య, బాబూరావు, సత్యనారాయణ, దుర్గాప్రసాద్, మాజీ జడ్పీటీసీ గరిణేకోటేశ్వర్రావు, అంబడికర్ర శ్రీనివాసరావు, కుందరవల్లి బసవయ్య పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణానికి పూజలు
పెన్పహాడ్ : చీదెళ్లలో ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సీతారాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డితో పాటు ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, గ్రామ పెద్దల సమక్షంలో వేదపండితులు భాస్కర శర్మ ప్రత్యేక పూజలు చేశారు. గుర్రం అమృతారెడ్డి, మహింద్రారాజు, పోతుగంటి మల్లికార్జున్, బిజిగ గోపి, పందుల నాగరాజు, నలబోలు లింగారెడ్డి, అంజిరెడ్డి, పెద్ద వెంకట్రెడ్డి, రాంరెడ్డి, రంగయ్య, కోటయ్య, అంజయ్య, గోపిరెడ్డి పాల్గొన్నారు.