చెన్నై: ఓ మతస్తులపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు సంబంధించి యాక్షన్ కొరియోగ్రాఫర్ కణల్ కన్నన్ను (Kanal Kannan) తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మతపెద్ద బాలికతో డ్యాన్స్ చేస్తున్నట్టు మార్ఫింగ్ వీడియోను కణల్ కన్నన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారని డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ అస్టిన్ బెనెట్ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలనూ కణల్ కన్నన్ జోడించారని అస్టిన్ బెనెట్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై కన్నన్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు ఆపై అరెస్ట్ చేశారు. పెరియార్ ఈవీ రామస్వామిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ద్రవిడ సంస్ధ ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది సైతం కణల్ కన్నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడుకు చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్, నటుడు కనల్ కణ్ణన్ తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ సినిమాలకు పనిచేశారు. తమిళ సినిమా చేరన్ పాండ్యన్తో 1991లో ఆయన తన సినీ కెరీర్ను ప్రారంభించారు. సినిమాల్లో ఆయన సేవలకు గాను కనల్ కణ్ణన్కు 16 అవార్డులు లభించాయి.
Read More :