బాలకృష్ణ (Balakrishna) కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అఖండ (Akhanda). ఈ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న బాలకృష్ణ జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాడు. అఖండ సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తో చేస్తున్న ఎన్బీకే 107 (NBK107)ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. మేకర్స్ బాలకృష్ణ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. బ్లాక్ షూట్, లుంగీ విత్ సాల్ట్ పెప్పర్ లుక్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని స్టన్నింగ్ లుక్తో అదరగొడుతున్నాడు.
బాలయ్య పక్కనే ఎస్యూవీ వెహికిల్ ఉండగా బ్యాక్ డ్రాప్లో మైనింగ్ ప్రాంతం కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే నందమూరి అభిమానులు ఆశించే అన్నీ ఎలిమెంట్స్ డైరెక్టర్ గోపీచంద్ ఈ చిత్రంలో పెట్టాడని తెలుస్తోంది. ఇప్పటికే ఓ లీక్ పోస్టర్ బయటకు రాగా..అవేవి పట్టించుకోకుండా డైరెక్ట్ గా ఫస్ట్ లుక్ను విడుదల చేసి బాలయ్య ఫ్యాన్స్ లో జోష్ నింపారు మేకర్స్. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
NATASIMHAM #NandamuriBalakrishna in his "MASS"iest Avatar ever!! 🔥🔥
Here's the Menacing First Look of #NBK107 😎💥💥#NBK107HuntBegins 🦁@shrutihaasan @officialviji @varusarath5 @megopichand @MusicThaman @MythriOfficial pic.twitter.com/vprOwLyHLQ
— BA Raju's Team (@baraju_SuperHit) February 21, 2022
అఖండకు సూపర్ డూపర్ బీజీఎం అందించిన థమన్ మరోసారి ఈ ప్రాజెక్టుకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ క్రేజీ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.