సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ (మం) సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. జేఎన్టీయూ క్యాంపస్‌లో నిన్న సాయంత్రం సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ చదువుతున్న విద్యార్థి రుత్విక్ పై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్ల వైఖరినిపై కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో విద్యార్థులు 161వ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో జతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను సముదాయిస్తున్నారు.