ములుగు రూరల్, సెప్టెంబర్ 27: గురుకులం విద్యార్థి అనారోగ్యానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన ములుగు మండలం ఇంచర్ల శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్నది. విద్యార్థి తండ్రి బాబు తెలిపిన వివరాల ప్రకా రం.. కన్నాయిగూడెం మండలం రాజన్నపేటకు చెందిన కోరం చరణ్ (15) గురుకులంలో పదోతరగతి చదువుతున్నాడు. గురువారం గురుకులం నుం చి ఫోన్ చేసి.. చరణ్ జ్వరంతో బాధపడుతున్నాడని, తీసుకెళ్లాలని చెప్పారు. చరణ్‌ను ములుగు ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు చికిత్స ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం విద్యార్థికి మూత్రం బంద్ కావడంతో వైద్యుల సూచన మేరకు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారం నుంచి జ్వరంతోపాటు మూడు రోజులుగా మూత్రం రావడం లేదని వైద్యులు తెలిపినట్టు విద్యార్థి తండ్రి పేర్కొన్నారు. చరణ్ మృతికి గురుకుల సిబ్బందే కారణమని ఆరోపించాడు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ఝాన్సీని వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ఆర్సీవో హరిసింగ్‌ను సంప్రదించగా విద్యార్థి గురుకులంలో మృతి చెందలేదని, జ్వరం తగ్గిన తర్వాత అతడిని సోదరి ఇంటికి తీసుకెళ్లిందని తెలిపారు. శుక్రవారం జ్వరం ఎక్కువ కావడంతో చరణ్ మృతి చెందినట్టు పేర్కొన్నారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రే పటి నుంచి 2,3 రోజులు భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.