అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల డిమాండ్లపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఏపీ జేఏసీ (AP JAC ) అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju ) హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదని వెల్లడించారు. తమ కష్టార్జితంతో కూడబెట్టుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు, బోనస్లు ఇస్తున్నారని, ఏపీలో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రభుత్వంపై వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దశల వారీగా ఉద్యోమాలను కొనసాగిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరామయ్యేవని తెలిపారు. ప్రభుత్వానికి అదనంగా డబ్బులు అడగడం లేదని వివరించారు. ఉద్యోగులను ప్రభుత్వం బెదిరిస్తే సహించబోమని హెచ్చరించారు.