Ramagundam Jobs | రామగుండం ఫర్టిలైజర్స్‌లో 40 మేనేజిరియల్ ఖాళీలు
Ramagundam Jobs | రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఖాళీగా ఉన్న పోస్టలను భర్తీ చేయనున్నది. దీనికి సంబంధించిన ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
Ramagundam Jobs | రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 40 మేనేజిరియల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి అర్హులైన, అనుభవజ్ఞులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది. ఐటీ, ఫైనాన్స్, కెమికల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను నింపనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని తెలంగాణలోని రామగుండం, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కార్పొరేట్ కార్యాలయాల్లో నింపుతారు.
ఖాళీలు
ఈ 40 ఖాళీలు.. కెమికల్ 18, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 6, మెటీరియల్స్ 4, మెకానికల్ 3, ఎలక్ట్రికల్ 3, హ్యూమన్ రిసోర్స్ 2, మెడికల్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1, ట్రాన్స్‌పోర్టేషన్ 1 విభాగాల్లో ఉన్నాయి. ఈ ఖాళీలను ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంజినీర్, ఆఫీసర్, ఆఫీసర్ సెక్రటేరియల్, అడిషనల్ సీఎంవో, సీఎంవో, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ పోస్టుల్లో నింపనున్నారు.

Rfcl Posts
అర్హతలు
పోస్టు (Post)ను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఎంపీబీఎస్, సీఏ, సీఎంఏ, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు ఏడాది నుంచి 18 ఏండ్ల వరకు ఉద్యోగానుభవం ఉండాలి. ఇంజినీర్ ఆఫీసర్ పోస్టులకు 30, అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్లకు 40, అడిషనల్ సీఎంవో, సీఎంవోకు 45, చీఫ్ మేనేజర్‌కు 50 లోపు వయసు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 700-1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక
దరఖాస్తులను స్క్రీనింగ్ (Screening) చేస్తారు. విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి షార్ట్‌లిస్ట్ తయారు చేస్తారు. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైనవారికి నెలకు ఇంజినీర్‌కు రూ. 40,000-1,40,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ. 50,000-1,60,00, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 60,000-1,80,000, అడిషనల్ మేనేజర్‌కు రూ. 70,000-2,00,000, సీఎంవోకు రూ. 80,000-2,20,000, చీఫ్ మేనేజర్‌కు రూ. 90,000-2,40,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. దీన్ని ప్రింట్ తీసుకుని అర్హత కలిగిన సర్టిఫికెట్లను జతచేసి నోయిడా (Noida)లోని కార్యాలయానికి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్ 24, హార్డ్ కాపీలను పంపడానికి చివరితేదీ అక్టోబర్ 1. ఇతర వివరాలకు వెబ్సైట్ https://www.rfcl.co.inలో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

