కొంతమోని కుంటకుకదిలిన అధికారులు
బాలాపూర్ సర్వే నంబర్ 273లోని కొంత మోని కుంటను రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ ఇందిరా దేవి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డీఈ సతీశ్, ఆర్ఐ జమీల్, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ జనార్దన్, హైడ్రా అధికారులు సర్వే చేసి..
-
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
-
తహసీల్దార్ ఇందిరా దేవి హెచ్చరిక
బడంగ్పేట్, నవంబర్ 7: బాలాపూర్ సర్వే నంబర్ 273లోని కొంత మోని కుంటను రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ ఇందిరా దేవి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డీఈ సతీశ్, ఆర్ఐ జమీల్, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ జనార్దన్, హైడ్రా అధికారులు సర్వే చేసి.. చెరువు సరిహద్దులను గుర్తించారు. ‘కొంతమోని కుంట కబ్జా’ పేరిట నమస్తే తెలంగాణలో శనివారం కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు చెరువు నాలాను, అలుగును పరిశీలించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిని గుర్తించారు. మూడు విభాగాల అధికారులు సమన్వయంతో చర్చించి.. సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో ఇరిగేషన్ అధికారులు గుర్తించిన సరిహద్దులు.. ప్రస్తుతం చూపిస్తున్న సరిహద్దులకు పొంతన లేనట్లు తెలిసింది. ప్రభుత్వ భూములు, చెరువులను, ఎండోమెంటు, భూదాన్, వక్క్ భూములను కబ్జా చేస్తే.. చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఇందిరా దేవి హెచ్చరించారు. కబ్జాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం అయితే క్రిమినల్ కసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

