‘కొబ్బరిమట్ట’ రీరిలీజ్
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం చక్కటి వినోదంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం చక్కటి వినోదంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సాయిరాజేష్ రచన, నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిరాజేష్ మాట్లాడుతూ “కొబ్బరిమట్ట’ విజయం నిర్మాతగా నాలో ధైర్యాన్నినింపింది. ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్నిచ్చింది.
అందుకే ఈ సినిమా నా కెరీర్లోనే ప్రత్యేకం. ఈ సినిమా రైటింగ్పరంగా అనేక ప్రయోగాలు చేశాం. రెండుమూడు నిమిషాల నాన్‌స్టాప్ డైలాగ్స్‌ని సంపూర్ణేష్‌బాబు అద్భుతంగా చెప్పాడు. ఇప్పటికీ సోషల్‌మీడియాలో ఆ డైలాగ్స్ వైరల్ అవుతుంటాయి. ప్రేక్షకుల్ని మరోమారు నవ్వించాలనే ఉద్దేశ్యంతో రీరిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాలో తాను మూడు విభిన్న పాత్రల్లో నటించానని, ఇప్పటికీ ప్రేక్షకులు ఫోన్ చేసి ‘కొబ్బరిమట్ట’ తమకు ఇష్టమైన సినిమా అని చెబుతుండటం సంతోషంగా అనిపిస్తుందని సంపూర్ణేష్‌బాబు అన్నారు. ఈ చిత్రంలో ఇషికాసింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

