దేశంలో 9.5 రోజులకు సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు!
దేశంలో ప్రస్తుతమున్న వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు పూర్తి స్థాయి సామర్థ్యంతో సుమారు 9.5 రోజుల డిమాండ్‌ను మాత్రమే తీర్చగలవని వెల్లడైంది.
- ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో ప్రస్తుతమున్న వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు పూర్తి స్థాయి సామర్థ్యంతో సుమారు 9.5 రోజుల డిమాండ్‌ను మాత్రమే తీర్చగలవని వెల్లడైంది. ప్రభుత్వ గణాంకాలు, ఇండియా టుడే దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం ప్రకారం.. వ్యూహాత్మక చమురు నిల్వలు పూర్తి సామర్థ్యం కంటే తక్కువగానే ఉన్నట్టు తేలింది. సోమవారం రాజ్యసభలో అందించిన డాటా ప్రకారం మొత్తం నిల్వ సామర్థ్యం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా, అందులో 64 శాతం, అనగా 3.372 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు మాత్రమే భారత్ వద్ద నిల్వ ఉంది.
ఈ నిల్వలు దేశంలోని పూర్తి స్థాయి చమురు అవసరాలను 9.5 రోజులు మాత్రమే తీర్చగలవని వెల్లడైంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ప్రతిష్ఠంభనతో వాణిజ్య నౌకల రవాణా నిలిచిపోవడంతో దాని ప్రభావం భారత్ సహా పలు దేశాలపై పడింది. ముఖ్యంగా చమురు అవసరాలకు 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడ్డ భారత్‌కు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది. దేశంలో అత్యవసర పరిస్థితుల కోసం పెద్దమొత్తంలో చమురు నిల్వ ఉంచే ప్రణాళికను వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ప్రణాళిక (ఎస్పీఆర్) అంటారు. 2004లో ఎస్పీఆర్ను ప్రారంభించగా, దీని కింద దక్షిణ భారత దేశంలోని మూడు నగరాల్లో భారీగా ముడి చమురును నిల్వ చేస్తుంటారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

