Congress : కాంగ్రెస్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రాజ్యాంగానికి తామే కాపలాదారుల్లగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని సీజేపీ విమర్శిస్తే.. నాటకాలు ఆపాలని కాంగ్రెస్ బదులిచ్చింది. ఈ పరస్పర విమర్శలకు కారణం ఇటీవల జరిగిన పరిణామాలే. గత వారం సీజేపీ నాయకులు అసోంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి విద్యా వ్యవస్థను పరిశీలించడంతోపాటు, వరదల పరిస్తితిని కూడా అంచనా వేయాలని సీజేపీ నేతలు భావించారు.
ఇందుకోసం గుహవటి చేరుకున్న ఆప్ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అసోం కాంగ్రెస్ నేతలు సీజేపీ నాయకుల్ని కలిసేందుకు ప్రయత్నించారు. దీనికి సీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్రమం అని, అందువల్ల కాంగ్రెస్ నేతల్ని కలవలేమని సీజేపీ నేతలు చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రీతమ్ సింగ్ తాజాగా వెల్లడించారు. అయితే, అసోంలో సీజేపీ నేతల్ని అరెస్టు చేసిన తర్వాత వారికి అక్కడి కాంగ్రెస్ నేతలే సాయం చేశారని సింగ్ అన్నారు. అయితే, సీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ అసోం అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌ను కలవడానికి ఇష్టపడలేదన్నారు.
It’s a very big problem. A certain section—not just the BJP—another party thinks “saving India, saving constitution” is only their job. They are self-declared liberals and self-declared thekedars of the constitution.
It’s a very salty ecosystem, acting worse than the BJP’s… https://t.co/RnbXSeX630
— Saurav Das (@SauravDassss) October 3, 2026
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆదేశాలు వల్లే కలవలేదని విమర్శించారు. అయితే, రీతమ్ సింగ్ ఇలా సీజేపీపై విరుచుకుపడటానికి కారణం సీజేపీ నేతల ట్వీట్లే. సీజేపీ అగ్రనేత అశుతోష్ రాంకా చేసిన ట్వీట్. ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష విజయవంతమైన సంగతి తెలిసిందే. దీంతో దీప్కేకు మంచి ప్రాచుర్యం లభించింది. ఈ అంశాన్ని రాంకా ప్రస్తావించారు. చాలాకాలం తర్వాత దేశంలో లక్షలాది మందిని కదిలించిన అభిజీత్ దీప్కే సాధించిన విజయాన్ని తమదే అని చెప్పుకొనేందుకు, ఆయన స్థాయిని తగ్గించేందుకు కొందరు స్వయం ప్రకటిత ఉదారవాదులు యాక్టివేట్ అయ్యారు.
అయితే, ఈ ఎకో సిస్టమ్ అంతా ట్విట్టర్లోనే ఉండటం విశేషం. పైగా వాళ్లు ప్రజాస్వామ్యానికి తామే రక్షకులం అని భావిస్తారు అంటూ ట్వీట్ చేశారు. ఇందులో నేరుగా కాంగ్రెస్ పేరు ప్రస్తావించకపోయినా.. అందులో కాంగ్రెస్ పార్టీనే వ్యతిరేకించినట్లు అర్థమవుతోంది. ఇదే అంశంలో సీజేపీ మరో నేత సౌరవ్ దాస్ కూడా ట్వీట్ చేశారు. రాజ్యాంగాన్ని తామే రక్షిస్తున్నామని చెప్పుకొనే మరో పార్టీ కూడా ఇలాగే చేస్తోందంటూ విమర్శించారు. బీజేపీ కాకుండా మరో పార్టీ ఎకో సిస్టమ్ కూడా తమకు వ్యతిరేకంగా పని చేస్తోందని అన్నారు. అయితే, వారు తమను విడదీయలేరని, వారి ఎత్తులు పారబోవని సౌరవ్ దాస్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటంతో ఆ పార్టీ నేత రీతమ్ సింగ్ స్పందించారు.