HomeNewsStone Pelting On Passengers In Car Parked On Pebberu Highway
దొంగల హల్చల్
44వ జాతీయ రహదారిపై దొంగలు స్వైర విహారం చేశారు. కారులోని ప్రయాణికులపై దాడిచేసి వారి నుంచి 14 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న వారిని తీవ్రంగా గాయపర్చారు. పెబ్బేరు పట్టణానికి సమీపంలో హైదరాబాద్ వెళ్లే రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఎస్పీ రావుల గిరిధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థా నిక ఎస్సై హరిప్రసాదరెడ్డి కథనం మేరకు.
పెబ్బేరు హైవేపై నిలిపిన కారులో ప్రయాణికులపై రాళ్లతో దాడి
14 తులాల బంగారం, బ్యాగుల చోరీ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
పెబ్బేరు, డిసెంబర్ 18 : 44వ జాతీయ రహదారిపై దొంగలు స్వైర విహారం చేశారు. కారులోని ప్రయాణికులపై దాడిచేసి వారి నుంచి 14 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న వారిని తీవ్రంగా గాయపర్చారు. పెబ్బేరు పట్టణానికి సమీపంలో హైదరాబాద్ వెళ్లే రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఎస్పీ రావుల గిరిధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థా నిక ఎస్సై హరిప్రసాదరెడ్డి కథనం మేరకు.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కూజన్కొత్తూరుకు చెందిన మూడు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది కారు(టీఎస్ 16ఎఫ్ జే 2266)లో అరుణాచలం, తిరుపతి ప్రాం తాలకు తీర్థయాత్రలకు వెళ్లారు.
వారు తిరిగి వస్తున్న క్ర మంలో విశ్రాంతి కోసమని జాతీయ రహదారి పక్కన భారీ ట్రక్కులు నిలిపే స్థలంలో కారు ఆపుకొని అందులోనే నిద్రపోయారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు నలుగురైదుగురు కారు అద్దాలు పగులగొట్టి దాడి చేశారు. మహిళలపై ఉన్న బంగారు వస్తువులను లాక్కొనే క్రమంలో అందులోని మగవారు అడ్డుకున్నారు. దీంతో దొంగలు వారిని రాళ్లు, కత్తులతో తీవ్రంగా గాయపర్చారు. గాయాలకు లోనైన సంతోష్, శ్రీశాంత్, ప్రణీత్‌ను మొదట వనపర్తి ఏరియా దవాఖానకు, తర్వాత మహబూబ్‌నగర్‌కు జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. దొంగలు 14 తులాల బంగారంతో పాటు, కారు టాప్‌పై ఉన్న బ్యాగులను ఎత్తుకెళ్లారు.
ఈ సమయంలో పక్కనే మూత్రశాలలకు కాపలా ఉండే వ్యక్తి నివాసముంటున్న గదిని బయట నుంచి గడి య పెట్టారు. మహిళల అరుపులు వినిపిస్తున్నా అతడు ఏ మీ చేయలేని పరిస్థితి నెలకొంది. చోరీ అనంతరం బాధితు లు గడియ తీయడంతో అతను బయటకు వచ్చి 100కు డ యల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 108 అంబులెన్స్‌లో బాధితులను దవాఖానకు తరలించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, కొత్తకోట సీఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీంచారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్లు చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించాయి.