e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News నా పెన్సిల్‌ దొంగిలించాడు.. కేసు పెట్టండి!

నా పెన్సిల్‌ దొంగిలించాడు.. కేసు పెట్టండి!

  • కర్నూలు జిల్లాలో స్నేహితుడిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (నమస్తే తెలంగాణ): సాధారణంగా చిన్నపిల్లలు పోలీసులను చూస్తేనే భయపడిపోతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు మారాం చేస్తే.. పోలీసులకు పట్టిస్తామని భయపెడతారు. కానీ, ఇటీవలి కాలంలో పిల్లలు ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులపై ఫిర్యాదులు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అలాంటి ఘటనే ఏపీలోని కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో జరిగింది. ఇద్దరు చిన్నారుల మధ్య పెన్సిల్‌ కోసం పేచీ మొదలైంది. రోజూ తన బ్యాగ్‌లో నుంచి పెన్సిల్‌ దొంగతనం చేస్తున్నాడంటూ ఓ విద్యార్థి తన స్నేహితుడితో గొడవపడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడంలేదంటూ గురువారం ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పెన్సిల్‌ దొంగతనం చేసిన తన స్నేహితుడిపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన పోలీసులు సరదాగా నవ్వుకొని సర్దిచెప్పారు. బాగా చదువుకోవాలని సూచిస్తూ అక్కడి నుంచి పంపించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement