చివర్లో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
ముంబై, మార్చి 23: దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 304 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 57,684.82 వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 304.48 పాయింట్లు నష్టపోయినట్లు అయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 69.85 పాయింట్లు నష్టపోయి 17,245.65కు పరిమితమైంది.
30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో 29 నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ షేరు రెండు శాతానికి పైగా నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, మారుతి సుజుకీ, మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్‌లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి.
డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఐటీసీలు మాత్రం లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్, ఆర్థిక, వాహన, ఇండస్ట్రియల్ రంగ షేర్లు కుదేలయ్యాయి.
బ్యారెల్ క్రూడాయిల్ ధర 2 శాతం పెరిగి 117.80 డాలర్లు పలికింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 24 పైసలు తగ్గి 76.42 వద్దకు జారుకున్నది.