Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దాంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మెరుగైన క్యూ2 ఫలితాలు మదుపర్ల (Investers) ను మెప్పించడం కలిసొచ్చింది. ఫలితంగా సూచీలు 1.3 శాతానికిపైగా లాభపడ్డాయి.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దాంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మెరుగైన క్యూ2 ఫలితాలు మదుపర్ల (Investers) ను మెప్పించడం కలిసొచ్చింది. ఫలితంగా సూచీలు 1.3 శాతానికిపైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ (Sensex) 1200 పాయింట్లకుపైగా ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 23,400 మార్కును దాటింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ (BSE) లో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.7 లక్షల కోట్లకుపైగా పెరిగింది.
ఉదయం 75,178.24 పాయింట్లవద్ద ప్రారంభమైన సెన్సెక్స్ (క్రితం ముగింపు 74,459.53) సూచీ రోజంతా అధిక లాభాల్లోనే కొనసాగింది. చివరికి 1233.25 పాయింట్ల లాభంతో 75,692.78 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 387.70 పాయింట్లు లాభపడి 23,440.80 వద్ద క్లోజయ్యింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.90 గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, మారుతీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

