సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మేదరబస్తీలోని మురళికృష్ణ రైస్ మిల్లు యజమాని, కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల మురళి గోపాలకృష్ణ, కో పార్టనర్ అంజనమ్మపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. రైతుల నుండి సేకరించిన 2,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని...
– రూ. 7 కోట్లు విలువ చేసే బియ్యం పక్కదారి
కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 02 : సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మేదరబస్తీలోని మురళికృష్ణ రైస్ మిల్లు యజమాని, కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల మురళి గోపాలకృష్ణ, కో పార్టనర్ అంజనమ్మపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. రైతుల నుండి సేకరించిన 2,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొత్తగూడెం నగరంలోని మేదరబస్తీలో గల మురళికృష్ణ రైస్ మిల్లుకు అప్పగించారు. ఈ సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లు పట్టించిన అనంతరం ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా మిల్లు యజమాని ఆళ్ల మురళి పక్కదారి పట్టించాడు. కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతగా చలామణి అవుతున్న ఆళ్ల మురళి ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడడం విమర్శలకు దారితీస్తుంది. పక్కదారి పట్టించిన ధాన్యం విలువ సుమారు రూ.6.90 కోట్ల పై చిలుకు ఉంటుందని సమాచారం.
పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ త్రినాథ్ బాబు బృందం గత నెల 28న మిల్లుపై దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. దీంతో అక్కడ ధాన్యం లేని విషయాన్ని గమనించిన అధికారులు ధాన్యాన్ని మిల్లు పట్టించి ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం తిరిగి ఇవ్వకుండా, ఇతరులకు అక్రమంగా తరలించినట్లు ధ్రువీకరించారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన సివిల్ సప్లైస్ జిల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు సదరు కాంగ్రెస్ నేత, మురళి కృష్ణ రైస్ మిల్ యజమాని ఆళ్ల మురళి, అతడి కో పార్టనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
‘రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి’
Sivakarthikeyan | షూటింగ్‌లోనే దర్శకుడికి ఖరీదైన బహుమతి.. శివకార్తికేయన్ మంచి మనసుపై నెటిజన్ల ప్రశంసలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

