ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
ఇస్రోలో టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసకుందాం.
యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (ISRO URSC) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసంది. దీని ద్వారా 61 ఖాళీలను నింపనుంది. హెవీ వెహికల్ డ్రైవర్-ఎ, లైట్ వెహికల్ డ్రైవర్-ఎ, స్టాఫ్ కార్ డ్రవైర్, ఫిట్టర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 13తో దరఖాస్తు గడువు ముగుస్తుంది.
పోస్టులవారీగా ఖాళీలు
టెక్నీషియన్-బి ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 24
టెక్నీషియన్-బి ఫిట్టర్- 8
టెక్నీషియన్-బి ఎలక్ట్రీషియన్- 4
టెక్నీషియన్-బి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్- 5
టెక్నీషియన్-బి టర్నర్- 1
టెక్నీషియన్-బి మెషినిస్ట్- 2
టెక్నీషియన్-బి మోటార్ వెహికల్ మెకానిక్- 1
టెక్నీషియన్-బి ఎలక్ట్రోప్లాస్టర్- 1
లైట్ వెహికల్ డ్రైవర్- 3
స్టాఫ్ కార్ డ్రైవర్-ఎ- 2
హెవీ వెహికల్ డ్రైవర్-ఎ- 10
అర్హతలు
టెక్నీషియన్-బి పోస్టులకు పదో తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
డ్రైవర్ పోస్టులకు SSC లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు హెవీ, లైట్ లైసెన్స్ కలిగి ఉండాలి. మూడేండ్ల అనుభవం ఉండాలి.

Posts
వయసు
అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏండ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక
అకడమిక్ మార్కుల ద్వారా స్క్రీనింగ్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు.
స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఫీజు
ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తు ఫీజు రూ. 500, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 400, మిగతా వారికి రూ. 500 ఫీజు రీఫండ్ చేస్తారు.
జీతం
ఎంపికైనవారికి నెలకు టెక్నీషియన్-బి పోస్టులకు రూ. 21,700, డ్రైవర్ పోస్టులకు రూ. 19,900 జీతంలో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
చివరితేదీ
అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ www.isro.gov.inలో చూడండి.

Position
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

