Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
Sailesh Kolanu | సినిమాల్లో కథానాయకులు తెరపై ఆపదలో ఉన్నవారిని కాపాడుతుంటారు. కానీ నిజ జీవితంలోనూ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో టాలీవుడ్ దర్శకుడు శైలేష్ కొలను ఒకరిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘అర్నాబ్’ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయన స్వయంగా సహాయం అందిస్తున్నారు.
Sailesh Kolanu | సినిమాల్లో కథానాయకులు తెరపై ఆపదలో ఉన్నవారిని కాపాడుతుంటారు. కానీ నిజ జీవితంలోనూ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో టాలీవుడ్ దర్శకుడు శైలేష్ కొలను ఒకరిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘అర్నాబ్’ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయన స్వయంగా సహాయం అందిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో స్పందించడమే కాకుండా, క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధిత కుటుంబాలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తుండటంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘అర్నాబ్’ తుఫాను ప్రభావంతో కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శైలేష్ కొలను అక్కడ సహాయక కార్యక్రమాలు చేపట్టారు. బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు, తాగునీరు, ఇతర అత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.
ఆయన ఇచ్చిన పిలుపుతో వందలాది మంది యువతీ యువకులు, స్థానికులు స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక బృందాలతో కలిసి శైలేష్ స్వయంగా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు తుఫాను సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రక్షణ చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులను కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా అభినందించారు. శైలేష్ కొలను చేస్తున్న సేవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో ఉత్కంఠభరితమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. నిజ జీవితంలోనూ బాధితులకు అండగా నిలవడం అభినందనీయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అదే సమయంలో సినీ పరిశ్రమలోని ఇతర ప్రముఖులు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి బాధితులకు సహాయం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారీ పారితోషికాలు, సినిమా టికెట్ ధరల పెంపు వంటి అంశాలపై చర్చించే సినీ ప్రముఖులు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా స్పందించాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక శైలేష్ కొలను సినీ ప్రయాణం కూడా ఆసక్తికరంగా సాగింది. ఆప్టోమెట్రీ, విజన్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన.. అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తగా, ప్రొఫెసర్‌గా పనిచేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ రంగాన్ని వదిలి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2020లో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Director #SaileshKolanu steps forward and initiates on-ground help activities & Relief supplies to support the families affected by #ArnabCyclone in Kakinada.
What he started as a call for help has turned into a collective effort, with hundreds of youngsters & several kind-hearted people stepping forward to volunteer.
Kudos to everyone who came together to make a difference ❤
— Vamsi Kaka (@vamsikaka) November 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

