Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలోని సుమారు 1500 మంది బోధనేతర సిబ్బంది.. నవంబర్ 4వ తేదీన వర్సిటీలో భారీ ర్యాలీ తీయనున్నారు. వర్సిటీలో శ్రమదోపిడీ జరుగుతోందని నాన్ టీచింగ్ స్టాఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ తన ప్రకటనలో ఆరోపించింది. ఓపీఎస్, సీపీఎస్ స్కీమ్‌లను బోధనేతర సిబ్బందికి అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లోని నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యమిస్తోంది. సుమారు 1500 మంది బోధనేతర సిబ్బంది.. నవంబర్ 4వ తేదీన వర్సిటీలో భారీ ర్యాలీ తీయనున్నారు. వర్సిటీలో శ్రమదోపిడీ జరుగుతోందని నాన్ టీచింగ్ స్టాఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ తన ప్రకటనలో ఆరోపించింది. 2001 నుంచి 2004 మధ్య నియమితుడలైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను బోధనేతర ఉద్యోగులు వ్యక్తం చేశారు. 2004 తర్వాత నియమితులైన వారికి సీపీఎస్ పెన్షన్ విధానం ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్జీవోస్, టెక్నికల్, ఎంప్లాయిస్ అసోసియేషన్లకు సంబంధించిన అన్ని ఇంటర్నల్ నోటిఫికేషన్లు ప్రమోషన్లను భర్తీ చేయాలన్నారు. ఎల్ఐసీ లింక్డ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్, సీపీఎస్ విధానాలను అమలు చేయాలని నాన్ టీచింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు వరకు ఉద్యోగులు ర్యాలీ తీయనున్నారు.
విజ్ఞానాన్ని పంచే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు దయనీయ, దుర్భర జీవితాలతో కాలం వెళ్లతీస్తున్నారని, దశాబ్ధాల కాలంగా పనిచేస్తున్న రెగ్యులర్, టైం స్కేల్, కాంట్రాక్టు ఉద్యోగుల హక్కులు నిలువునా కాలరాస్తున్నట్లు నాన్ టీచింగ్ స్టాఫ్ తన ప్రకటనలో పేర్కొన్నది. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను 10వేల నుంచి 30 వరకు పెంచాలని బోధనేతర సిబ్బంది డిమాండ్ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ డా బి కుమార్, కో చైర్మెన్నాగరాజు రావు, ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్ బేగ్, వైస్ ప్రెసిడెంట్ సి ఉపేందర్, వైస్ ప్రెసిడెంట్ పి పవన్ కుమార్, జనరల్ సెక్రటరీ బి వెంకటేశ్, జాయింట్ సెక్రటరీ వి నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ యారాల రాజేష్, సెక్రటరరీలు, అఫ్సర్ , అంజయ్య, ట్రెజరర్ విఠల్ గౌడ్.. మీడియాకు రిలీజ్ చేసిన లేఖలో డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
‘రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి’
Sivakarthikeyan | షూటింగ్‌లోనే దర్శకుడికి ఖరీదైన బహుమతి.. శివకార్తికేయన్ మంచి మనసుపై నెటిజన్ల ప్రశంసలు!
పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా? : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

