నార్నూర్ : నీతి అయోగ్‌లో భాగంగా మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah ) అన్నారు. మంగళవారం నార్నూర్ ( Narnoor ) మండల కేంద్రంలో డిజిటల్ లైబ్రరీతోపాటు ఐటీ స్కిల్ సెంటర్‌ను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ,యువకుల భవిష్యత్తుకు విద్య ఓ ఆయుధమన్నారు. మండలంలో దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పుస్తక, దినపత్రిక పఠనంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మండల అభివృద్ధికి సంబంధించి సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్, అడిషనల్ జిల్లా కలెక్టర్ రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఐటీడీఏ ఈ ఈ తానాజీ, ఐసీడీఎస్ పీడీ మిల్కా, తహసీల్దార్ జాడి రాజాలింగం, ఎంపీడీవో పుల్లారావ్, ఆయా శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.