హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పిల్లర్‌పై ప్రముఖ కిన్నెర వాద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్య పెయింటింగ్‌ను పునరుద్ధరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
పెయింటింగ్ కనిపించకుండా పలువురు పోస్టర్లు అంటించగా, మొగిలయ్య ఫిర్యాదులను బల్దియా అధికారులు పట్టించుకోలేదు. దీంతో స్వయంగా మొగిలయ్యనే పోస్టర్లను తొలగిస్తున్న దయనీయ పరిస్థితిపై గురువారం నమస్తే తెలంగాణ కిన్నెర కన్నీరు శీర్షికతో కథనం ప్రచురించింది. నమస్తే ఎఫెక్ట్‌తో జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు.