
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. జగిత్యాల వేదికగా సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో సిద్దిపేటపై నిజామాబాద్ విజయం సాధించింది. బాలుర కేటగిరిలో నిజామాబాద్ జట్టు టైటిల్ దక్కించుకుంది. నాలుగు రోజుల పాటు ఈ టోర్నీలో గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారని క్రీడాధికారి రామలక్ష్మణ్ పేర్కొన్నారు. ఇలా రెండు విభాగాల్లో విద్యార్థులు విజేతలుగా నిలువడం సంతోషంగా ఉందన్నారు.